నిజామాబాద్ A9 news :
నిజామాబాద్ నగరంలో 6వ రోజు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు నిజామాబాద్ లోని ధర్నా చౌక్ లో తమ సమ్మెను కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదని ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ ఏర్పాటు కొరకు జరిగిన పోరాటం సందర్భంగా అప్పటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం సరైనది కాదని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపాలని అనేకమార్లు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఖాళీలను భర్తీ చేయటానికి రాత పరీక్షలు నిర్వహించటం కొరకు నోటిఫికేషన్ జారీ చేయటంతో ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమై తమ రెగ్యులరైజేషన్ కొరకు వెంటనే చర్యలు చేపట్టాలని రిటర్న్ టెస్ట్ కు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని,
ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వెలిబుచ్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు పుష్ప కవిత నాగలక్ష్మి తదితరులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.