నిజామాబాద్ A9 news
మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలో నైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, దిగువకు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉన్నది.
గోదావరి నదీ దిగువ పరివాహక ప్రాంతం లోకి పశువులు, మత్స్యకారులు, పశువుల కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని కోరుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి.