గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపినా వాటి ఓనర్లు మరియు ఎవరూ కూడా సంప్రదించనందున అట్టి వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం వేయనున్నట్టు ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి తెలిపారు. ఇందులో ఆటోలు, రోడ్డు రోలర్, మినీ గూడ్స్ వాహనాలు, గూడ్సు వాహనాలు, బొలెరోలు, స్కూలు బస్సులు, మోటార్ సైకిల్ తదితర వాహనాలు ఆర్మూర్ బస్ స్టాండ్ లో మరియు
నందిపేట్, మోర్తాడ్, ముప్కాల్, బాల్కొండ పోలీస్ స్టేషన్లు మరియు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల కు ఈనెల 29న “యాస్ ఇస్ వేర్ ఇస్” ఎక్కడ ఉన్నవి అక్కడ పద్ధతిలో వేలం నిర్వహించ నున్నట్టు తెలిపారు. ఆసక్తి కలవారు ధరావతు చెల్లించి ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా సూచించారు. వేలంపాట ఆర్మూర్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం ఎం జె కాలనీ యూనిట్ ఆఫీస్ లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.