నిజామాబాద్ జిల్లా సెప్టెంబర్:12
A9 న్యూస్ :
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ 8వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏసీబీకి పెద్ద పెద్ద తిమింగలాలు చిక్కుతున్న లంచాలు తీసుకోవడాలు ఆగడం లేదు. అనంతరం ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఒక ఆటో డ్రైవర్ కొత్తగా కట్టుకున్న ఇంటి నెంబర్ కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ పదివేల లంచం అడిగాడని. చివరికి 8 వేలకు ఒప్పందం కుదరడంతో బాధితుడు గత వారం రోజుల నుండి ఫోన్లు చేస్తున్నాడని దీంతో బుధవారం 8వేల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఎనిమిది వేల రూపాయలను రికవరీ చేసి. రికార్డులను సీజ్ చేశామని. విచారణ నిమిత్తం రిమాండ్ కు తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజలకు లంచాలు అడిగితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈయన వెంట ఏసిబి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్. వేణు. నగేష్ ఉన్నారు.