నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
ఈరోజు సిద్ధి వినాయక (ఎస్ఎల్ఎఫ్ )డీ. గంగామణి ఆర్ .పి గారి ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లి కి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నడని తెలుసుకొని వారి కుటుంబానికి “గుప్పెడుబియ్యం” లో భాగంగా 80 కేజీల బియ్యాన్ని అందించి మరియు మాకు తోచిన ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మా సంఘ సభ్యులు శ్రీమతి పల్లవి ,పద్మ, శిరీష, వాణి ,జమున తదితరులు పాల్గొన్నారు. ఇలాగే గుప్పెడు బియ్యం లో భాగంగా ప్రతి నెల నిరుపేదలకు గుర్తించి వారికి మాకు తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుందని తెలుపుచున్నాము. మాకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం అందించిన మేము మరింత ఎక్కువ మందిని గుర్తించి వారికి మా వంతు సహాయం చేయడం జరుగుతుందని ఇట్టి సందర్భంగా తెలియజేయడం జరిగింది.