A9 న్యూస్ హైదరాబాద్:
పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని
తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే వారి పై క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారు.