A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఎకరానికి రూ. 10వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. వరదవల్ల రూ. 5,438 కోట్ల నష్టం జరిగిందన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతోపాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల్లో రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అయితే ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం వస్తోందని సీఎం అన్నారు.