చత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ రఘునందన్ రావు…

On: Tuesday, February 17, 2026 5:46 AM

 

ఎ9 న్యూస్, చేగుంట, మెదక్ – ఫిబ్రవరి 17:

చేగుంట మండలంలోని మక్కారాజ్‌పేట గ్రామంలో మహానుభావుడు చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, నేటి యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఎటువంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా, శివాజీ చూపిన ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల వంటి గుణాలను అలవరచుకోవాలని సూచించారు.

దేశభక్తి, నాయకత్వ లక్షణాలు మరియు సమాజ సేవలో శివాజీ మహారాజ్ చూపిన మార్గాన్ని అనుసరించి మంచి ఆదర్శాలను ఏర్పరచుకోవాలని యువతకు ఆయన సూచించారు.

05 Aug 2026

Leave a Comment