ఆర్మూర్‌లో నల్లబ్యాడ్జీలతో భారీ నిరసన….
ఆర్మూర్ పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో కార్యాలయం ముందు ఆగ్రహ నిరసన వ్యక్తం చేశారు.
సంఘ భవనం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా సాగిన ఈ నిరసనలో పెన్షనర్లు తమ సమస్యలపై నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ రావు, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్లకు తగిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని తెలిపారు.
పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి:
2వ పీఆర్సీని 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయడం, పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించడం, ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేసి ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం, సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించడం, అలాగే ప్రభుత్వ ముందున్న 63 డిమాండ్లను వెంటనే పరిష్కరించడం.
ఈ డిమాండ్ల సాధన కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి నవజీవన్, గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుష్పకర్ రావు, ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు గంగారెడ్డి, కోటేశ్వర్, సుధాకర్, గంగాధర్, హరి నారాయణ, జింధం నరహరి, అలాగే ఇతర పెన్షనర్లు పాల్గొన్నారు.








