ఆర్మూర్ 29వ వార్డులో ముత్తూట్ ఫైనాన్స్ రుణాల మేళా ఘన ప్రారంభం….

On: Friday, April 17, 2026 4:48 PM

 

ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు అంబేద్కర్ చౌరస్తా వద్ద ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు రుణాల మేళా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి 29వ వార్డు కౌన్సిలర్ బాత్ నాసే తిరుమల సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజలకు ఇలాంటి ఆర్థిక అవకాశాలను అందిస్తున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యాన్ని తిరుమల సుమన్ అభినందించారు. అనంతరం కౌన్సిలర్ తిరుమల సుమన్ ని పట్టు శాలువాతో, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్ పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రజలు, భారీగా హాజరయ్యారు.

18 Apr 2026

Leave a Comment