హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎస్ప్రెస్బ, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసులో చార్జీల పెంచుతున్నట్లు చెప్పింది. మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీల వసూలు చేయనున్నట్లు సమాచారం. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. అయితే.. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి..








