గవ్వలపల్లి, ఏప్రిల్ 20
సోమవారం చిన్న శంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూపాల్ సిద్ధి రాములు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఈ కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మి ధాన్యం అమ్మకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగ నరేందర్ యాదవ్ రావు, ఐకెపి సీసీ రాజు, గోవింద్, వివో శశిరేఖ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ పగడాల శ్రీకాంత్.








