ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్‌కు కొత్త దిక్సూచి…

On: Wednesday, December 10, 2025 9:56 AM

 

విక్కీ యాదవ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

A9 న్యూస్:

ఆదిలాబాద్ యువతలో నూతన ఉద్వేగానికి నాంది పలుకుతూ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ గారిని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలో పార్టీ శక్తిని మరింతగా విస్తరించడంలో విక్కీ యాదవ్ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

నూతన బాధ్యతల కోసం తనను ఎంపిక చేసినందుకు జాతీయ కార్యదర్శి & రాష్ట్ర ఇంచార్జ్ ఖలీద్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారికి విక్కీ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో యువతలో కాంగ్రెస్ స్ఫూర్తిని పెంచి, పార్టీ బలోపేతం దిశగా ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

04 Aug 2026

Leave a Comment