హైదరాబాద్:ఏప్రిల్ 17
హైదరాబాద్ శంషాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాలు నుంచి మూడు కిలోల గంజాయిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీ య విమానాశ్రయం కేంద్రం గా జరుగుతున్న డ్రగ్స్ రవాణాకు కస్టమ్స్ అధికారులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం థాయ్ ఎయిర్ వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరా బాద్ వచ్చిన మహిళ ప్రవర్తన అనుమానాస్ప దంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదు పులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో దాచి ఉంచిన డ్రగ్స్ బయటపడ్డాయి.
స్వాధీనం చేసుకున్నది సాధారణ గంజాయి కాదని, అధిక మత్తునిచ్చే హైడ్రోపోనిక్ గంజాయి అని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ ధర ఉంటుంద ని చెప్పారు. పట్టుబడిన మహిళను అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆమె కేవలం కొరియరా? లేక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నా యా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
నగరంలో ఎవరికి ఈ డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ఆమె వచ్చిందనే వివరాలు రాబ ట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగిన నేపథ్యంలో, శంషా బాద్ విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్ఠం చేసినట్లు అధికారులు వెల్లడించారు.






