సూర్యాపేటలో హిట్-అండ్-రన్ — కానిస్టేబుల్ కమలాకర్‌కు తీవ్ర గాయాలు

On: Sunday, November 16, 2025 5:31 AM

 

🔴 బ్రేకింగ్ న్యూస్ ….

సూర్యాపేట జిల్లా — నాగారం శివారు

వాహనాల తనిఖీ చేస్తూ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టి పరారైంది.

బలమైన ఢీకొట్టడంతో కానిస్టేబుల్‌కు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. సహచరులు వెంటనే ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన కారు సంఘటన స్థలం నుంచి వెంటనే పారిపోవడంతో, ఆ వాహనం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు ప్రారంభించారు. సమీప సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

19 Jul 2026

Leave a Comment