ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఫీల్డ్ అసిస్టెంట్…..

On: Tuesday, December 30, 2025 5:37 AM

 

ప్రభుత్వం ఆదేశాలు జారీ జింక లింగం సస్పెన్షన్…

తూప్రాన్ ,ఎ9 న్యూస్, మెదక్, డిసెంబర్ 30:

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఫీల్డ్ అసిస్టెంట్ జింక లింగం ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) ని ఉల్లంఘించి బహిరంగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు హేమ బిక్షపతి, కత్తుల స్వామి, నల్లా ప్రవీణ్‌, మేఘావత్ నరేష్ నాయక్, బుక్య శేఖర్ నాయక్ లు వీడియోలు, ఫోటోలు సహా పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలతో తూప్రాన్ ఎంపీడీఓకు, ఎన్నికల కమిషన్ కు, జిల్లా కలెక్టర్ కు, డి.అర్.డి.ఏ పిడి లకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ, ఫీల్డ్ అసిస్టెంట్ జింక లింగంపై తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేశారు. ఈ మేరకు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ నిర్వహించి, ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిర్ధారణ కావడంతో ఫీల్డ్ అసిస్టెంట్ జింక లింగాన్ని విధుల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వు లను అమలు చేయాలని డిసెంబర్ 29న తూప్రాన్ నాడు ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి, ఫీల్డ్ అసిస్టెంట్ జింక లింగం, ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో పాటు వర్తించే ఎన్నికల చట్టాలు ప్రభుత్వ సేవా నియమావళిని ఉల్లంఘించి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి గ్రామస్తులు హేమ బిక్షపతి, కత్తుల స్వామి, నల్లా ప్రవీణ్‌, మేఘావత్ నరేష్ నాయక్ బుక్య శేఖర్ నాయక్ లు వీడియోలు ఫోటోలు మరియు ఇతర డాక్యుమెంటరీ ఆధారాలతో తూప్రాన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేశారు.

దీనిపై స్పందించిన డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ సమగ్ర విచారణ నిర్వహించి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఎన్నికల నియమావళి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి (కాండక్టు రూల్స్)ను ఉల్లంఘించినట్లు తేల్చారు. ఈ మేరకు సంబంధిత ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని డిసెంబర్ 29న తూప్రాన్ ఎంపీడీఓకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు మాట్లాడుతూ జింక లింగం నీ వీధుల నుంచి సస్పెన్షన్ తో పాటు పోలీసులు కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

18 Jan 2026

Leave a Comment