నిజామాబాద్: ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దొడ్డెనుక గోపికి ₹23,000/- మరియు అంకోల్ల నరేష్‌కు ₹18,000/- విలువైన చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుంట గంగయ్య, గోలెం దాసు, కనకం రాజేందర్, కనకం నాగేష్, దొడ్డెనుక బుచ్చన్న, లాలెందు గంగన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు దొడ్డెనుక గోపి, అంకోల్ల నరేష్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కి తమ కృతజ్ఞతలు తెలిపారు.







