లవ్ జిహాద్ ఘటనలపై ఆర్మూర్‌లో ఆందోళన…..!

On: Friday, April 17, 2026 4:53 PM

కఠిన చర్యలు కోరిన నేతలు…

ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న కొన్ని సామాజిక ఘటనలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రజలను చైతన్యపరచే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. అలాగే అక్రమ ఆక్రమణలు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే ఘటనలు వంటి అంశాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ బొచకర్ నిఖిల్, నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సహా కార్యదర్శి బోబిడే కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సహా సంయోజక్ అభిలాష్, సేవా ప్రముఖ్ శ్రీకాంత్, సప్తాహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బలోపాసన ప్రముఖ్ సాయి, సంస్కృత ప్రముఖ్ యోగేష్, అలాగే ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

18 Apr 2026

Leave a Comment