A9 news,Jul 15, 2025,
ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల మధ్య జల వివాదాల సమావేశంలో బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు. దీంతో ఆయన లేఖలో గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ ప్రస్తావించారు. కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు తదితర అంశాలను జత చేస్తూ.. లేఖ పంపారు.







