వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట యువసేన యూత్

On: Friday, September 5, 2025 9:40 PM

 

చిన్న శంకరంపేట (ఆర్), మెదక్ జిల్లా:

చిన్న శంకరంపేట మండలంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ జీవన్ గారు, మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహాన్ని దానం చేసిన ఆకుల శ్రీనివాస్ గారికి యువసేన యూత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని, భక్తిశ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలో యువత సందడి చేసి, గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.

21 Jan 2026

Leave a Comment