ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ!.
హైదరాబాద్:ఏప్రిల్ 23:
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది, తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నే నేడు రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతుంది,పాలన పరమైన వ్యవహారాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్షతన అత్యంత కీలకమైన కేబినెట్ సమావే శం జరగనుంది, అంబేద్కర్ సచివాలయంలో ఆరో అంతస్తులో రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది.
ఈ భేటీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 32 సమస్యలపై మంత్రివర్గం ఈరోజు చర్చించనుంది, అన్ని అంశాలను పరిశీలించి సమ్మె పరిష్కారానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది,ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కూడా మంత్రి వర్గం చర్చిస్తుందని సమాచారం.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వద్ద పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీల అంశం, పరిషత్ ఎన్నికలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెట్రో రైల్ స్వాధీనం, ఉద్యోగుల డిమాండ్ల వంటి సమాలో చనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు సంస్థ లకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి,అధ్యక్షతన సచివాల యంలో మధ్యాహ్నం జర గనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు కు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు లో సవాల్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. తుమ్మిడిహట్టి నుంచి నేరుగా సుందిళ్లకు లింక్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై చర్చించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శించి అక్కడ జరుగుతు న్న టెస్టింగ్ ప్రక్రియను పరిశీలించడం సహా నీటి పారుదల శాఖ అధికారుల తో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు లింక్‌పై సమా లోచనలు చేయనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఎలా ముందు కెళ్లాలనే అనే అంశంపై చర్చించి, కొన్ని కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసు కోనున్నట్లు తెలుస్తోంది.








