*అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
*ఊరువాడ ఘనంగా తమ సోదరులకు రాఖీ కట్టిన మహిళలు
అగస్ట్ 19: భీమ్ గల్
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం:
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం భీమ్ గల్ మండలం, గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి దీవెనలు తీసుకున్నారు. తోడబుట్టిన ఆడపడుచులకు ఎల్లప్పుడూ రక్షగా రక్షగా ఉండాలని ప్రతిజ్ఞతో ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున సోదరులు తమ సోదరీమణులకు రాఖీ కట్టి రక్షగా నిలుస్తారు. అయితే కొన్ని కొన్ని కుటుంబాలలో సోదరులకు సోదరీమణులు, సోదరీమణులకు సోదరులు ఉండకపోవడంతో పెద్దవారైనా తండ్రిలు, పెద్దనాన్నలు, తాతలకు రాఖీ కట్టి ఆశీర్వాదం పొందరు.