A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా గత 10 సంవత్సరాల నుండి పార్టీ అధికారంలో లేకున్నా,కష్ట కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని అరెస్టులు,నిర్బంధలు చేసిన ధీటుగా ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడిన నేను ఈ నెల 10 వ తారీఖు నుండి ప్రారంభం కానున్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్ష పదవికి నామినేషన్ వేసాను అని, తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష అభ్యర్థి కాలగడ్డ శ్రీకాంత్ కోరారు. జిల్లా అధ్యక్షుడిగా తనను గెలిపిస్తే జిల్లా యువకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.