పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్ ఆగ్రహం…

On: Wednesday, October 8, 2025 6:23 PM

 

దళిత మంత్రిపై అనుచిత వ్యాఖ్యలేంటని ప్రశ్నించిన జన్నపల్లి రంజిత్.

ఆర్మూర్.అక్టోబర్ 08,

దళిత మంత్రిపై అవమానకరంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ పై బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎస్సీ సెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జన్నపల్లి రంజిత్ మాట్లాడుతూ దళిత మంత్రిని పట్టుకుని దున్నపోతు’ అని అన్న పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి.లేదంటే ఆయనపై జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేస్తాం.దళిత సమాజం ఎక్కడికి వెళ్లినా, ఆయనను ప్రశ్నించే స్థాయిలో ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

దళితుల గౌరవం స్వాభిమానం దెబ్బతీసేలా మాట్లాడే రాజకీయ నేతలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.దళిత సమాజాన్ని అవమానించే మాటలు ఎవరైనా అన్నా క్షమించబోమని రంజిత్ పేర్కొన్నారు.

08 Nov 2025

Leave a Comment