డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు….

On: Saturday, December 6, 2025 1:28 PM

 

A9 news ఆర్మూర్:

సమాజానికి సమానత్వం – న్యాయం – స్వేచ్ఛ అనే మహత్తర విలువలను అందించిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ BRS నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న, పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, SC సెల్ అధ్యక్షులు జన్నాపల్లి రంజిత్, మాజీ కౌన్సిలర్ రాజబాబు, మాజీ ZPTC మెట్టు సంతోష్, యువజన నాయకులు పృథ్వీ, మీరా శ్రవణ్, గణేష్, సాయి, మైనారిటీ నాయకులు అర్షద్, సైఫ్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు.

వారి ప్రసంగంలో నాయకులు అంబేద్కర్ చూపించిన మార్గం ఎప్పటికీ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని, ఆయన విలువలను పాతుకుపోయేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

18 Jan 2026

Leave a Comment