ఆర్మూర్‌లో రాజకీయ వేడి – జీవన్ రెడ్డిపై బీసీ సెల్ అధ్యక్షుడు దోండి రమణ మండిపాటు…

On: Thursday, December 4, 2025 8:31 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దోండి రమణ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిరోజూ ఆర్మూర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

జీవన్ రెడ్డి గతంలో చేసిన అక్రమాలు ప్రజలందరికీ తెలుసుని, కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసే అర్హత ఆయనకు లేదని రమణ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను దుర్వినియోగం చేస్తూ, స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

“ఇలా కొనసాగితే ఆర్మూర్‌లో అడుగుపెట్టనివ్వం” అని రమణ స్పష్టం చేశారు. శనివారం తోపారం భాగత్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించనున్న నిరసనకు బీసీ సెల్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

14 Jun 2026

Leave a Comment