ప్రతి గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం….

On: Thursday, July 16, 2026 6:47 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట,  జూలై 16:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ లోని ప్రతి గురువారం సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు అభిషేకం చేస్తూ వస్త్రాలు ధరించి, భక్తుల నుంచి హారతులు పట్టిస్తారు.అదేవిధంగా భక్తులు పాటలు, కీర్తనలతో సాయిబాబాను ఆనందపరుస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించి వారి కోరికల మేరకు ఆలయంలో విశ్రాంతి తీసుకుని 11 గంటల నుండి 12:30 వరకు పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ప్రతి గురువారం నాడు సాయిబాబా పేరు మీద అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాయిబాబా దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు అన్నారు.వందల సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు, పాదచారులు, ఇతర పనుల మీద పలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెట్లా తిమ్మాయిపల్లి మాజీ ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, నారాయణ చారి, గుర్రం నాగరాజు, టెంట్ హౌస్ బిక్షపతి, రేపల్లె ఆంజనేయులు, పూజారి తదితరులు పాల్గొన్నారు.

16 Jul 2026

Leave a Comment