రంగయ్యపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత….

On: Wednesday, July 8, 2026 7:53 AM

స్థానిక ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పై అధికారులు నిర్వహించిన ప్రజా సేకరణలో అరెస్టుల వెల్లువ…

గ్రామస్తుల ఆందోళన…..

ఎ9 న్యూస్ మనోహరాబాద్/ మెదక్ జూలై 7  :

గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, నాయకులు బసవన్న గారి సత్యనారాయణ గౌడ్ , కాశిరెడ్డి ని మరియు బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

వెంటనే స్పందించి వంటేరు ప్రతాప్ రెడ్డి కి మరియు చెట్ల గౌరవం రంగయ్యపల్లి గ్రామస్తులకు సంఘీభావం తెలిపిన మెదక్ మాజీ ఎమ్మెల్యే మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి .

ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల నిర్బంధంలో ప్రజా సేకరణ చేయడం చాలా దుర్మార్గమన్నారు, వెంటనే ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ అక్కడి నుండి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు, పోలీసులను పెట్టి బలవంతంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.

కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేయడం అధికారులు వత్తాసు పలకడం చాలా దుర్మార్గమన్నారు.

ప్రభుత్వం యొక్క నిర్బంధ వైఖరి నిరంకుశ వైఖరి మానుకోవాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.ఈరోజు చేసిన సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కాదని ప్రజలను నిర్బంధించి అభిప్రాయ సేకరణ చేశారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్థానం బతికే ఉందా అని ప్రశ్నించారు.

మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ వారు అక్రమంగా ప్లాంట్ నిర్మాణం చేసి రైతుల పొలాల్లోకి ప్లాంట్ నీటిని చేయడంతో కాలుష్యంతో రైతుల పొలాల్లో పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బంది పడడంతో అక్కడికి వచ్చిన కలెక్టర్ ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్ ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు, ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే బూడిద ద్వారా ప్రతిరోజు రెండు గ్రామాలలో పొగ మంచు వాతావరణం ఉంటుందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు, ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ద్వారా భూమి కలుషితమై, బోర్ వేసుకున్న పొల్యూషన్ కలుషితమైన నీరు వస్తుందని, పంటలను పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, కూరగాయలు పండించుకోలేని పరిస్థితి ఉందని పొల్యూషన్ తో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల యొక్క ఊపిరితితులు సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని వెంట్రుకలు ఓడిపోతున్నాయని ప్రజలు ఫ్యాక్టరీ వలన నానా గోసాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ నుండి వెలువడి పొల్యూషన్ రోజురోజుకు ఎక్కువవుతుందనీ, ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ నుండి వెలివాడే పొల్యూషన్ ద్వారా భూములు పాడైపోతున్నాయని మండిపడ్డారు,

ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు దాదాపు 98% పైగా ప్రజలు కంపెనీని మా గ్రామాల నుండి తీసివేయాలని కోరుతున్నారని, ఫ్యాక్టరీ వలన ఇబ్బంది పడుతున్నారని, ఫ్యాక్టరీని తీసివేయడానికి ధర్నాలు పోరాటాలు చేస్తే డబ్బు బలంతో ఎమ్మెస్ అగర్వాల్ పోలీస్ వాళ్లను అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేయించి ధర్నాలు చేసిన వారిని పోలీసు వారితో కొట్టించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు, గ్రామ ప్రజల సమస్యలను వినడానికి వెళ్లిన ప్రతాపరెడ్డి గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులను , గ్రామ ప్రజలను యువకులను,ఫ్యాక్టరీ వద్ద దాదాపు సుమారు 300 మంది పోలీసుల బలగాలని మోహరించి అక్రమంగా అరెస్టు చేసి శంకరంపేట పోలీస్ స్టేషన్కు శివంపేట పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించడం అప్రాజస్వామికమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.

డబ్బు బలంతో ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ దొంగచాటును డబ్బులు ఇచ్చి కేవలం 40 మంది ప్రైవేట్ వ్యక్తులచే ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు,

చెట్ల గౌరవం రంగాయిపల్లి గ్రామాల ప్రజల ప్రజాభిప్రాయం సేకరిస్తే 98% ప్రజలు కంపెనీ వద్దు అని కంపెనీ మూసివేయాలని అంటారని ఎమ్మెస్ అగర్వాల్ గారు ఎన్జీవో కార్డులను అడ్డం పెట్టుకొని, గ్రామ ప్రజలకు సంబంధం లేకుండా , గ్రామాల ప్రజలు లేకుండా దొంగచోటన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చాలా దారుణం అన్నారు, ఈ సమస్యపై రేపు ఉదయం 12 మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందిస్తామని తెలిపారు, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీ వద్ద ప్రజా అభిప్రాయన సేకరణ కూడా చేపడతామన్నారుకలెక్టర్ కూడా మానవతాల దృక్పథంలో ఆలోచించి గ్రామస్తులకు న్యాయం చేయాలన్నారు లేని పక్షంలో గ్రామస్తుల తరఫున న్యాయస్థానాలను ఆశ్రయించి గ్రామ ప్రజల సమస్య తీరేవరకు, ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీని తొలగించే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు, ప్రజా అభిప్రాయ సేకరణ అనేది పోలీసుల నిర్బంధంలో కాకుండా ప్రజల మధ్యలో జరగాలని తెలిపారు, అధికారులు వెంటనే స్పందించకపోతే రెండు గ్రాములు రెండు గ్రామాల ప్రజలు దాదాపు 3000 మందితో నేషనల్ హైవే ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు, కేసులు బిఆర్ఎస్ పార్టీకి కొత్తవి కావని, ప్రజల కోసం ఎంత దూరానికైనా ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధంగా ఉన్నామణి, ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని హెచ్చరించారు, తాటాకి చప్పుళ్లకు భయపడేది లేదని తెలిసి చెప్పారు. చెట్ల గౌరవం రంగాయిపల్లి గ్రామ ప్రజల కోసం యువకుల కోసం పిల్లల భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు, ఎమ్మెస్ అగర్వాల్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీర్థం అక్కడి నుండి తీసివేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల ప్రజలు తదితరులున్నారు.

09 Jul 2026

Leave a Comment