ఓటరు జాబితా సవరణలో ప్రజలకు మార్గదర్శనం….

On: Wednesday, July 8, 2026 7:17 PM

 

టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రత్యేక కార్యక్రమం…

 

A9 న్యూస్:

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దొండి రమణ సూచించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణలకు సంబంధించిన ఫారాలను ప్రజలతో నింపించి, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నిర్వహిస్తున్న ప్రక్రియకు సహకారం అందించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదై ఉండేలా ప్రతి కుటుంబం తమ వివరాలను పరిశీలించుకోవాలని ఆయన కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు, వివరాల్లో మార్పులు చేయించుకోవాల్సిన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

09 Jul 2026

Leave a Comment