స్టేషన్ మాసాపేట గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెల్లడి….
ఎ9 న్యూస్, మాసాయిపేట, జూలై ,14 :
మాసాయిపేట మండలం కేంద్రంలో ని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ శివారులో ప్రతి అమావాస్య రోజున ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు పోచమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి,వస్త్రాలు సమర్పణ జరుపుతామని నిర్వాహకులు అన్నారు. అనంతరం దేవాలయం వద్ద గత మూడు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవాలయం భక్తులు తెలిపారు. అదేవిధంగా స్టేషన్ మాసాయిపేట గ్రామ సర్పంచ్ స్టేషన్ శ్రీను, ఆధ్వర్యంలో అన్నదానం జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు శాలిపేట రాములు, గుడిసె శ్రీనివాస్, కాసా నర్సింగరావు, బొల్లు నరసింహులు, బండారి నాగేష్, మైనార్టీ మాజీ ఉపసర్పంచ్ గౌస్, వార్డ్ సభ్యులు జాఫర్, మైనార్టీ గ్రామ పెద్దలు, అన్వర్ హుస్సేన్, మజీద్ హుస్సేన్, సహకారంతో ప్రతినెల అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని మాసాయిపేట స్టేషన్ పోచమ్మ దేవాలయం వధ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి నవనీత, ప్రస్తుతం వార్డు సభ్యులు ,ఉపసర్పంచ్ పాల్గొని విజయవంతం చేశారు.








