తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు (జులై 13) 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
పిల్లల్లో నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను నివారించేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని వైద్యాధికారులు తెలిపారు. 1–2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర, 2 ఏళ్లకు పైబడిన వారికి 400 మి.గ్రా. పూర్తి మాత్ర ఇవ్వాలని సూచించారు. అలాగే, ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాతే మాత్ర తీసుకోవాలని అధికారులు సూచించారు.








