
ఆర్మూర్. నవంబర్ 03,
వైద్యం వ్యాపారమై మానవత్వమే మాయమైపోతున్న ఈ రోజుల్లో శారీరక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు చికిత్స చేస్తూ విలువలతో కూడిన ప్రజా వైద్యునిగా జన హృదయాలను గెల్చి నిరంతరం ప్రజాసేవలో సాగుతున్న సర్వోత్తమ డాక్టర్ మధుశేఖర్ బర్తడే కి అంబేడ్కరైట్లు శుభాకాంక్షలు తెల్పారు. సోమవారం ఉదయం జిల్లా నిజామాబాద్ ఆర్మూర్ సిటీలోని ఎం.జె హాస్పిటల్ సుప్రీమొ, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరగాయి. ఈ సందర్బంగా సర్వ ధర్మీయ, సర్వ జాతుల, మరి ముఖ్యంగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోతున్న ఆయనకు ప్రొఫెసర్ పి.లక్ష్మీనరసు రచించిన “బుద్ధ ధర్మ సారం” అనే గొప్ప పుస్తకాన్ని భేటీగా ఇచ్చి షాల్వా కప్పి అంబేడ్కరైట్లు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు డాక్టర్ గారు తమ జీవితంలో మరెన్నో సేవ కార్యక్రమాలు చేయూత సంస్థ ద్వారా నిర్వహించాలని ఆశించారు. ఇందులో డా.అంబేడ్కర్ యువజన సంఘం మండల నాయకులు జిన్నా జనార్దన్, పింజ సుదర్శన్, అంగుళి మాలజీ, సీనియర్ అంబేడ్కరైట్ పింజ భోజన్న, ఘోడ్కే రవీందర్ కటికే, ప్రఖ్యాత గాయకులు ఇర్గాల సుమన్, ఇర్గాల గణేష్, సురేష్ వాగ్మారే, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.








