హైదరాబాద్:సెప్టెంబర్ 03
కొన్ని ఏళ్లుగా గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వేదిక కానుంది ఈ పథకం కింద నిర్మించిన ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదిగా జరగనుంది., ఈ నేపథ్యం లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు.
బుధవారం మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నా రు. ఇవాళ ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములకు ముఖ్యమంత్రి బయలుదేరుతారు.
ఉదయం 11.30గంటల సమయంలో వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభిస్తారు. 12.30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం కొత్తగూడెం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు.
ఇదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి, పర్యటిం చనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చండ్రుగొండకు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత 2.35 నుంచి 2.50 గంటల వరకు బెండాల పాడులో నిర్మించిన ఇంది రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం 2.50 నుంచి 3.05 గంటల వరకు ఇక్కడ నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.25 గంటలకు చండ్రుగొండలోని హెలీ ప్యాడ్ నుంచి బయలుదేరి 5.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఢిల్లీ పర్యటనకు వెళ్లుతుండడం విశేషం. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం.
భారీ వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టాలతోపాటు యూరియా కొరత సమస్య పై భట్టి, తుమ్మల కేంద్ర మంత్రులను కలిసి నివేదిక సమర్పించనున్నారు. ఆస్తి, పంట నష్టాలకు కేంద్ర సాయం అందించాలని, యూరియా కొరత సమ స్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి వారు కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిమిత్తం పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.








