తాళ్ల రాంపూర్‌లో జర్నలిస్టుపై దాడి – ప్రెస్ క్లబ్‌ల ఖండన…..

On: Wednesday, September 17, 2025 12:29 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్‌లు బుధవారం ఖండన తెలిపాయి. ఈ సందర్భంగా పాత్రికేయులు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి లను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని పేర్కొన్న ప్రెస్ క్లబ్ నాయకులు, ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పనిసరి అని డిమాండ్ చేశారు. అలాగే ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

“ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా నిలిచే పాత్రికేయుల భద్రతను కాపాడటం అధికారుల ప్రధాన బాధ్యత” అని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంలో పోలీసులు, అధికారులు తక్షణం జోక్యం చేసుకోవాలని వారు కోరారు.

14 Feb 2026

Leave a Comment