గంగాసముందర్ గ్రామాభివృద్ధికి సేవ చేసే అవకాశం కలిపించండి.
ఉంగరం గుర్తుతో సర్పంచ్ భరిలో తొగరి గంగామణి
గంగాసముందర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న తొగరి గంగామణి గ్రామాభివృద్ధికి సంక్షేమ పథకాలే ప్రధాన ఆధారమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, యువత సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, పారదర్శక పాలనతో గంగాసముందర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.
🗳️ ఉంగరం గుర్తుకే ఓటు వేసి తొగరి గంగామణి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







