మచ్చర్లలో దారుణం….

On: Saturday, December 13, 2025 10:15 AM

 

మాజీ ఎంపీపీ కారు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు..

ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారును గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

ప్రతిరోజులాగే పస్కా నరసయ్య తన కారును ఇంటి వద్ద పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో కారులో నుంచి పొగలు, మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఈ విషయాన్ని నరసయ్యకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

25 Jun 2026

Leave a Comment