A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు లింగన్న, నియోజకవర్గ ఇన్చార్జి కొంతం మురళీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపకర్త అంబేద్కర్ అందించిన సమాన హక్కులు, ఓటు హక్కు ప్రతి భారతీయుడికి గొప్ప వరమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ కొంతం పూర్ణచందర్, పులి యుగేందర్, మేదరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.







