డొంకేశ్వర్ :
ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.
ఈ సందర్భంగా MRPS మండల ఇంచార్జి పైడాకుల ప్రశాంత్ మాదిగ మాట్లాడుతూ:
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరిస్తున్నారని విమర్శించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత మూడు నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని, ఈ నెల 20వ తేదీన గ్రామ పంచాయతీల వద్ద కూడా ముట్టడులు చేపడతామని హెచ్చరించారు. అనంతరం MRO గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ ముట్టడిలో వికలాంగుల సంఘం డొంకేశ్వర్ మండల అధ్యక్షులు భూమేష్, నర్సన్న, నందిపేట్ మండల అధ్యక్షులు లక్ష్మి, ఉమ్మడి మండలం ఇంచార్జ్ ఖలీం, చరణ్, హన్మంత్ రెడ్డి, MRPS మండల ఇంచార్జి పైడాకుల ప్రశాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.







