ప్రాణం పోసిన అభిమానం….

On: Tuesday, September 2, 2025 11:24 AM

 

వనపర్తి జిల్లా సెప్టెంబర్02

సినిమా కథను తలపించే లా వనపర్తి జిల్లాలో ఒక అద్భుతం జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడనుకొని.. అంత్యక్రియలకు సిద్ధం చేయగా అభిమాన నాయకుడు అతడికి ప్రాణం పోశాడు. చాతీపై ఉన్న అభిమాన నాయకుడి పచ్చబొట్టును చూసి మాజీ మంత్రి అతడిలో కదలికను గుర్తించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలిచాయి. చావు అంచుల కు వెళ్లిన వ్యక్తిని సదరు మాజీ మంత్రి దేవుడిలా వచ్చి కాపాడారంటూ స్థాని కులు కొనియాడుతున్నారు.

చనిపోయాడనుకున్న అభిమానిని బతికించిన నాయకుడు పచ్చబొట్టుతో ప్రాణాన్ని నిలబెట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తసినిమా ను మించిన స్టోరీ లాగా ఉంది,సినిమాల్లో చూసే అద్భుతం నిజ జీవితంలో జరిగింది. చనిపోయాడని భావించిన ఒక వ్యక్తి.. అంత్యక్రియలకు సిద్ధమైన తర్వాత తిరిగి ప్రాణాలతో బయటపడ్డాడు.

అతని ఛాతీపై ఉన్న తన అభిమాన నాయకుడి పచ్చబొట్టే ఈ అద్భుతానికి కారణమైంది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘ టన ఇప్పుడు చర్చనీయాం శంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి పట్టణానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వీరాభిమాని అయిన రమేష్.. తన అభి మానాన్ని చాటుకుంటూ ఛాతీపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నారు.

కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్న రమేష్.. మూడు రోజుల క్రితం వనపర్తిలోని పీర్లగుట్టలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చారు.ఆదివారం అల్పాహారం తీసుకున్న తర్వాత రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికే స్పృహ తప్పిపోయి ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆయన చనిపోయారని నిర్ధారించు కున్నారు. విషాదంలో మునిగిపోయిన కుటుంబం, అంత్యక్రియ లకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. రమేష్ మృత దేహంపై పూలమాల లు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

తన అభిమాన కార్యకర్త మరణ వార్త విని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రమేష్‌ను చివరిసారి చూసేందుకు వెళ్లారు. అక్కడ పూలమాలల మధ్య నిశ్చలంగా ఉన్న రమేష్ దేహాన్ని చూస్తుండ గా.. నిరంజన్‌ రెడ్డి కళ్లు అతని ఛాతీపై ఉన్న తన పచ్చబొట్టుపై పడ్డాయి.

అదే సమయంలో.. రమేష్ ఛాతీ కొద్దిగా కదలడాన్ని గమనించిన నిరంజన్‌ రెడ్డికి అతడు ప్రాణాలతోనే ఉన్నాడనే అనుమానం వచ్చింది.వెంటనే స్పందించి రమేష్‌పై ఉన్న పూలమాల లు తొలగించారు. ఆయన పేరు పెట్టి గట్టిగా పిలవగా.. రమేష్ కనురెప్పలు కదిలించారు. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. తక్షణమే రమేష్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడ గంటసేపు చికిత్స అందించిన తర్వాత రమేష్ కళ్లు తెరిచారు. రమేష్ ఇంకా బతికున్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.వైద్యులు రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలిం చాలని సూచించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. చావు అంచుల నుంచి రమేష్‌ను మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి దేవుడిలా వచ్చి కాపాడార ని కుటుంబ సభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. అభిమానం కారణంగా వేయించుకున్న పచ్చబొట్టు, దైవంగా భావించిన నాయకుడి కంటికి పడటం.. ఆ నాయకుడే వచ్చి తనను బతికించడం అనేది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి మరి.

05 Feb 2026

Leave a Comment