మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్‌పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….

On: Thursday, August 28, 2025 8:59 PM

 

ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి:

ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ప్రజలను అప్రమత్తం చేశారు. రెండు వైపుల నుంచి ఎవరూ ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.

అలాగే, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

13 Mar 2026

Leave a Comment