కామారెడ్డి జిల్లా: ఆగస్టు 28
తెలంగాణ రాష్ట్రంలోభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క, కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉన్నారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవల అందు బాటును సమీక్షించడంతో పాటు, వారిలో భరోసా నింపేలా చర్యలు చేపట్టారు.
వర్ష బీభత్సం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించా రు. గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు అధికార యంత్రాంగంతో వరద పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క, ప్రజల రక్షణ కోసం చర్యలను వేగవంతం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. జలమయమైన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్థి నష్టం జరక్కుండా చర్యలు చేపడుతోంది.
SDRF, NDRF, అగ్నిమాపక పోలీస్ టీంలు ఇప్పటికే రంగంలో దిగాయి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.







