జాతీయ బేస్‌బాల్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారుల ఎంపిక….

On: Tuesday, August 26, 2025 2:06 PM

 

నిజామాబాద్:ఆదిలాబాద్  జిల్లాలో ఇటీవల నిర్వహించిన 5వ సీనియర్ మహిళల మరియు పురుషుల బేస్‌బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈ టోర్నీలో బాలికల విభాగంలో తొలి స్థానం సాధించిన జట్టు సభ్యులు — ఆర్మూర్ టీఎస్ డబుల్ ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలకి చెందిన సౌమ్యారాణి, జీజీ కాలేజ్‌కు చెందిన శృతి, అనూష, మరియు టీఎస్ డబుల్ ఆర్‌ఎస్ సుద్దపల్లి కి చెందిన శరణ్య — జట్టును విజయవంతంగా నడిపించారు.

పురుషుల విభాగంలో జీజీ కాలేజ్‌కు చెందిన సాయికుమార్ మెరుగైన ప్రదర్శనతో ఎంపికయ్యాడు.

ఈ క్రీడాకారులు ఆగస్టు 28 నుండి 31 వరకు మహారాష్ట్ర అమరావతిలో జరగనున్న జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు అని తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్వేతా గారు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎల్. మధుసూదన్ రెడ్డి, జిల్లా సెక్రటరీ సొప్పరి వినోద్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శులు జక్రాన్‌పల్లి మరకంటి గంగామోహన్, కోచ్ నరేష్, మౌనిక, పీఈటీలు జోష్ణ, నర్మద మరియు ఉపాధ్యాయ బృందం క్రీడాకారులను అభినందించారు.

15 Mar 2026

Leave a Comment