ఆర్మూర్ బాలికల కళాశాలలో 31న స్పాట్ అడ్మిషన్ …..

On: Tuesday, July 29, 2025 3:34 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల నందు 2025- 26 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం బై.పీ.సీ, ఎం.పీ.సీ, లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.రాగలత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలను (క్యాస్ట్, ఇన్ కమ్, డేట్ అఫ్ బర్త్, పదవ తరగతి మెమో) తీసుకొని కళాశాల యందు హాజరుకావాలని అదే రోజు సాయంత్రం ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు.

14 Mar 2026

Leave a Comment