నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి గండికోట రాజన్న శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడి పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు డప్పు వాయిద్యాలతో భారీ ఎత్తున ఊరేగింపుగా ఓపెన్ టాప్ కార్లో ప్రజలకు అభివాదం చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా బిసి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తనను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఒక్క అవకాశం ఇస్తే పేద వర్గాల ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నిస్తూ పోరాడతానన్నారు. నియోజకవర్గ ప్రజలను తనకు ఆవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొమిరె సుధాకర్, పట్టణ అధ్యక్షులు బక్కోల్ల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లెపు రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుంకరి నాగరాజు, ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్, డోంకెశ్వర్ మండలాల అధ్యక్షులు గోపి, బొర్రోల్ల సురేష్, ఎర్రోల్ల ప్రేమ్ కుమార్, బంటు రాజేశ్వర్ , నాయకులు అల్లె ప్రసాద్, బాజన్న, నీరడి సాయన్న , ఎస్.ఎస్ కార్తీక్, యువకులు అజయ్, కన్నా, దండుగుల బజన్న, అశోక్ రజక, అరుంధతి సంగ నాయకులు, అరుంధతి యూత్ యువకులు, ఒడెరా సంగం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.