రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ…

On: Monday, August 3, 2026 6:48 AM

* రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ…

* ముఖ్య అతిథి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి…

A9 న్యూస్ మాసాయిపేట:

రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి గత నెలలో మాసాయిపేట మండల ప్రజల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల (ఐ క్యాంపు) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ఐ క్యాంపులో నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలు అవసరమైన లబ్ధిదారులను గుర్తించారు. అనంతరం వారికి ప్రత్యేకంగా కంటి అద్దాలను తయారు చేయించి, నేడు మాసాయిపేట మండల కేంద్రంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాజన్న ఫౌండేషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన వైద్య సేవలు పొందలేని ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలు మాలాంటి పేదవారికి కళ్ళజోడు పంపిణీ చేసినందుకు అందరూ మంచిగా ఉండాలని దీవెనలు అందించారు కొంతమంది ఆపరేషన్లు చేసుకున్న వారు కొనియాడారు ఇలాంటి నాయకుడు కావాలని పదేపదే వారి ముందు గ్రామములో అంటున్నారు ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు ముందుకు వచ్చి పేద ప్రజల గురించి పట్టించుకునే నాధుడే లేడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ వీరన్న కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ పసుల వెంకటేశం, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పెరమండ్ల రమేష్, పంజా వెంకటేశం, సీనియర్ నాయకుడు మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు గౌడ్, డైరెక్టర్ఉదండపురం నరసింహులు , ఇతర గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ ఇతర గ్రామాల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

04 Aug 2026

Leave a Comment