ఆర్మూరులో జోరుగా వర్షం.. 24 గంటల్లో 34 మి.మీ. వర్షపాతం నమోదు….

On: Thursday, July 30, 2026 3:56 PM

 

A9 న్యూస్ – ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గత 24 గంటల్లో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం సంచిత వర్షపాతం 334.0 మిల్లీమీటర్లకు చేరుకుంది.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. సాగు పనులు మరింత వేగం పుంజుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

04 Aug 2026

Leave a Comment