ప్రస్తుతం 16 టీఎంసీల నీటి నిల్వ.. గతేడాదితో పోలిస్తే జలమట్టం తగ్గుదల..
A9 న్యూస్ నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,051 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఇన్‌ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఈ ఏడాది నీటి నిల్వ గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తీవ్రతను బట్టి రానున్న రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే వరద ప్రవాహంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.








