భక్తులకు అన్నదాన సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం…
A9 న్యూస్ ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ దేవి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అరే లింబాద్రి ఆధ్వర్యంలో, దేవాంగ సంఘం అధ్యక్షులు తొగర్ల రాజేశ్వర్ నేతృత్వంలో ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయం మేరకు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేవాంగ సంఘం సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు నిర్వాహకులను అభినందిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గురు పౌర్ణమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాంగ సంఘం అధ్యక్షులు గడ్డి ప్రకాష్, చేనేత సహకార సంఘం వైస్ చైర్మన్ డేరా మోహన్, 5వ వార్డు కౌన్సిలర్ గీత ప్రసాద్, 6వ వార్డు కౌన్సిలర్ షేర్ల మమత గంగాధర్ గౌడ్ (గంగోలి), డిష్ గంగాధర్, పసుపుల గంగాధర్, పసుపుల జగదీష్, గైని రవి, బల్ల నరేష్, గడ్డి గంగాధర్, తొగర్ల బొంబాయి రాజేశ్వర్, తొగర్ల గంగాధర్, పూజారి గంగాధర్ (లాడు), నవోదయ గంగాధర్, గైని చిన్న గంగాధర్, గుండెం నాగయ్య, తొగర్ల చిన్న భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.








