మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు రైతు మృతి….

On: Saturday, June 27, 2026 7:37 PM

 

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధర్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బోరుబావి మరమ్మతు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో తలదాచుకోవడానికి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లిన వెల్దుర్తి గ్రామానికి చెందిన పొన్నగంటి మైసయ్య (40)పై పిడుగు పడింది.

ఈ ఘటనలో మైసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ విషాద ఘటనతో వెల్దుర్తి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.విలేకరి శ్రీకాంత్.

27 Jun 2026

Leave a Comment