2026–27 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వర్క్‌బుక్స్ అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని సుమారు 12 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచేందుకు రూపొందించిన ఈ వర్క్‌బుక్స్ పంపిణీని జూలై మొదటి వారంలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. SCERT రూపొందించిన ఈ వర్క్‌బుక్స్‌లో అభ్యాస కార్యకలాపాలు, వర్క్‌షీట్లు, పునశ్చరణ అంశాలు ఉండనున్నాయి.








